- Advertisement -
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ తొలిరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.
ఇక ఇవాళ రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిని కలువనున్నారు.
గడ్కరీతో సమావేశంలో జాతీయ రహదారులకు నిధుల మంజూరు, హర్దీప్ సింగ్‌తో సమావేశం సందర్భంగా సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయం గురించి చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -