అసెంబ్లీ ఎన్నికల్లో తాను నల్లగొండ స్ధానం నుంచి పోటీ చేద్దమనుకున్నానని చెప్పారు సీఎం కేసీఆర్. కానీ గజ్వేల్ ప్రజల కోరిక మేరకు నేను అక్కడి నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఇవాళ నల్లగొండ నియోజకవర్గంలోని నిర్వహించిన ప్రజా ఆశిర్వాద సభకు హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. నా స్ధానంలో భూపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చానని తెలిపారు. భూపాల్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని అతన్ని అసెంబ్లీకి పంపిస్తే నల్లగొండను అభివృద్ది పదంలో నడిపిస్తారని చెప్పారు.
కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేసిన గెలిచే సత్తా ఉన్న లీడర్ అని గతంలో ప్రో. జయశంకర్ సార్ అన్నారని గుర్తు చేశారు. ఈసందర్భంగా నల్గోండను అభివృద్ది చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. భూపాల్‌రెడ్డిని గెలిపిస్తే.. నల్లగొండ నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకుంటానని హామీ ఇస్తునన్నారు. నల్లగొండ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీరాలన్నా.. ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు రావాలన్నా అది భూపాల్ రెడ్డితో సాధ్యమైతదన్నారు.