కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహణ..

188
kcr meeting
- Advertisement -

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, డీపీఓలందరికీ మొదట టెంపరేచర్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలోని నీళ్లు, సబ్బుతో అందరూ శుభ్రంగా చేతులు కడుక్కున్నారు. అలాగే, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా హ్యాండ్ సానిటైజర్స్ ఇవ్వడంతో చేతులను సానిటైజ్ చేసుకున్నారు. సమావేశంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించారు. లోపల సీట్లు కూడా దూరం దూరంగా ఏర్పాటు చేయడంతో, భౌతిక దూరం పాటించి కూర్చున్నారు.

మధ్యాహ్న భోజనానికి వంట చేసి, వడ్డించే విషయంలో కూడా సిబ్బంది అందరూ కోవిడ్ నిబంధనల ప్రకారం పూర్తి పరిశుభ్రత పాటించారు. మొదట డైనింగ్ హాలును పూర్తిగా సానిటైజ్ చేశారు. వంట చేసే వారితోపాటు వడ్డించే వారిని కూడా శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేసి, లోపలకు పంపారు. ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో శుభ్రపరచుకున్నాక, అందరికీ సానిటైజర్లు ఇచ్చారు. వంట సిబ్బంది అందరూ చేతులకు గ్లౌజులు, నోటికి మాస్కులు, తలకు ప్రత్యేకమైన టోపీలు ధరించారు. ఒక్కొక్కరూ రెండు మీటర్ల దూరం ఉంటూ వంటలు చేశారు. వండిన ప్రతి వంటనూ ఒక మీటరు దూరంలో ఉంచి అందరికీ వడ్డించారు. వాడి పడవేసే చెక్క స్పూన్లనే ఉపయోగించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మధ్యాహ్న భోజనం చేశారు.

- Advertisement -