రాష్ట్రంలో నియంత్రిత పంటల విధానం అమలు: సీఎం

196
CM KCR Review Meeting With Collectors
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేసేందుగాను జిల్లా పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి, మార్కెట్ డిమాండ్ ఏ పంటకు ఉంది, షాత్రీయ విధానం ద్వారా పంటల సాగు, రైతు బంధు క్లష్టర్లలో రైతు వేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటు, విత్తనాల సరాఫరా, మెకనైజెషన్ ఇన్వెంటరీ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, రైతు బందు సమితీల అధ్యక్షులు, వ్యవసాయ అధికారులతో దాదాపు రెండున్నర గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు హరీష్,ప్రతీక్ జైన్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు.వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గీత తదితర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్లు, రైతుబంధు అధ్యక్షులు, వ్యవసాయ అధికారులనుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షుభిత రంగం కాకుండా సంక్షేమ రంగంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించారు. డిమాండ్ సరఫరా, మార్కెట్‌లో మంచి ధరలు, అధిక దిగుబడి పంటలు, యాంత్రికీకరణ, వ్యవసాయ యంత్రాల అందుబాటు తదితర అంశాల ఆధారంగా ప్రతి జిల్లాలో వ్యవసాయ క్లస్టర్ల ప్రాతిపదికగా నియంత్రిత పంటల విధానాన్ని రూపొందిచనున్నట్టు తెలిపారు. ప్రతి క్లస్టర్ ప్రామాణికంగా ఏ పంటలు వేయాలో, నెలల పరిస్థితి, మంచి దిగుబడి, మంచి ధర తదితర అంశాల ప్రాతిపదికగా ఈ విధానం ఉంటుందని తెలియ చేశారు. ప్రస్తుతం రానున్నవర్షాకాలంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాల పంటలు వేయడానికి ఏవిధమైన నియంత్రణ లేదని, అయితే వరి సాగు విషయంలో ప్రభుత్వమే ఏ విధమైన సన్నాలు, దొడ్డు, ఇతర ఫైన్ రకమైన విత్తనాలు వేయాలో సూచించి ఆయా వరి విత్తనాలను కూడా రైతులకు అంద చేస్తుందని ప్రకటించారు.

వరి విత్తనాలను ప్రభుత్వమే అంద చేస్తున్నందున రైతులు ప్రయివేటుగా విత్తనాలు కొనుగోలు చెయ్యొద్దని చెప్పారు.దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, అనేక దేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండే దాదాపు 90 శతం విత్తనాలు సరఫరా అవుతాయని తెలిపారు. ఈ వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కజొన్న పంటను వేయొద్దని స్పష్టం చేశారు. వర్షాకాలంలో మక్కపంట దిగుబడి అతి తక్కువగా రావడమే కాకుండా, మొక్కలకు అతి తక్కువ ధర లభిస్తుందని, దీనికి తోడు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రాల నుండి అతితక్కువ ధరకు అమ్మెందుకు మొక్కలను తెలంగాణకు తెస్తున్నారని వివరించారు. వికారాబాద్ జిల్లా కందులకు దేశవ్యాప్త బ్రాండింగ్ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో కందుల సాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కందులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

రైతులు వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చిందుకై ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికల నిర్మాణం చేయాలని నిర్ణయించామని, రానున్న ఆరు నెలల్లో ఈ వేదికల నిర్మాణం పూర్తి చేయడానికి స్థలాలను గుర్తించడం, దాతలనుండి స్వీకరించే పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లోనిచెరువులలో వ్యవసాయ అవసరాలకు తరలించే రైతులను అడ్డుకోవద్దని రెవిన్యూ, సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో రీసర్చ్, అనాలిసిస్ విభాగాన్ని, మార్కెటింగ్ విభాగాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరో రెండు సంవత్సరాల్లో అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు.

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన నియంత్రిత పంటల విధానం అమలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు, ఫార్మ్ మోడరనైసేషన్ ఇన్వెంటరీ, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు వేదికల నిర్మాణానికి స్థలాల గుర్తింపు తదితర అంశాలపై మంగళవారంనాడు రైతు బంధు సమితిల భాద్యులు, రెవిన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాథమిక ప్రణాలికను రూపొందించనున్నట్టు కలెక్టర్ అమయ్ కుమార్ తెలియ చేశారు.

- Advertisement -