సాగునీటి రంగంపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు..

433
kcr
- Advertisement -

గురువారం సీఎం కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అనంతరం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సాగునీటి రంగంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

– ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ.
– సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు క్రిందికి.
– సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థ ను 11 సర్కిల్ విభజన.
– సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్.
– జూన్ నెలా ఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో ఖాళీలు భర్తీ చేయాలి.
– ఏప్రిల్ నెలాఖరు లోగా ఇరిగేషన్ అధికారులు,సిబ్బందికి క్వార్టర్ ల నిర్మాణం పూర్తి చేయాలి.
– 530 TMC ల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలి.
– రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలి.
– సాగునీటి కాలువలకు మే నెలాఖరు లోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలి.
– కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ల స్థానంలో కొత్త కలెక్ట. -రేట్ ల నిర్మాణం చేపట్టాలి.
– కొత్త కలెక్టరేట్ లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సీఎం ఆదేశం.

- Advertisement -