కొత్తగా 32 కేసులు.. నగరంపై ప్రత్యేదృష్టి- సీఎం

376
kcr cm
- Advertisement -

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి,నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను,లక్‌డౌన్‌ అమలుపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 32 మందికి కరోనా వచ్చిందని, ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు వెయ్యి నుంచి 1100 మందికి పరీక్షలు నిర్వహించేలా అన్ని ల్యాబ్‌లు, అస్పత్రులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 17 మంది మృతిచెందారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరంపై ప్రత్యేదృష్టి కేంద్రీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌ను 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌ను యూనిట్‌గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్‌ కేసులు నమోదైన కంటైన్‌మెంట్‌ జోన్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యదిక జనసామర్ద్యం ఉండే జిహెచ్‌ఎంసిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్‌ శాఖ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్‌ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్‌లోనే జిహెచ్‌ఎంసిలోని సర్కిళ్ల వారిగా ప్రత్యేక సమీక్ష సరపాలని,పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్క్షప్తి చేశారు.

- Advertisement -