అందరి చూపు బీఆర్ఎస్ మేనిఫెస్టో పైనే..

36
- Advertisement -

తెలంగాణ ఎన్నికల సమరంలో దూసుకుపోతోంది బీఆర్ఎస్. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాలను చుట్టేసింది. మంత్రి కేటీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పలు నియోజకవర్గాల్లో ప్రగతి నివేదన సభలు నిర్వహించగా ఇక సీఎం కేసీఆర్ సైతం ఇవాళ్టి నుండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

అలాగే ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులకు బీ ఫామ్‌ అందజేయనున్నారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మేనిఫెస్టో విడుదల, బీ-ఫారాల అందజేత కార్యక్రమం ఉండనుండగా అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు అధ్యక్షతన జరిగే పార్టీ ఎన్నికల సభకు హాజరవుతారు.

ఇక అందరిచూపు బీఆర్ఎస్ మేనిఫెస్టోపైనే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించనున్నారు. మేనిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read:పాక్‌పై తిరుగులేని భారత్..

- Advertisement -