హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్..

215
CM KCR

తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరే ముందు వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డి విడ్కోలు పలికారు.

శ్రీవారి దర్శనం కోసం ఆదివారం కుటుంబసమేతంగా తిరుపతికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ మహాద్వారం నుంచి గర్భగుడిలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్ శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనానంతరం వారిని సన్మానించి, స్వామివారి ఆశిస్సులతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.శ్రీవారిని దర్శించుకున్న వారిలో కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ సంతోష్‌ కుమార్‌,ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.