చెన్నూర్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ స‌భ..!

43
CM KCR
- Advertisement -

తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రస్థాయి నేత‌లు మ‌రో ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లున్నాయ‌న్నంత హ‌డావిడి చేశారు. స‌భ‌లు, పాద‌యాత్ర‌ల‌తో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం మేమే అని జ‌నంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా, టీఆర్ఎస్ కూడా అభివృద్ధి ప‌నుల‌తో నిత్యం జ‌నాల్లోనే ఉంటుంది. దీంతో తెలంగాణ‌లో రాజకీయం హాట్ హాట్ గా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల వాగ్ధానాలు కూడా ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీ మ‌రో అడుగు ముందుకేసింది.

తాము అధికారంలోకి వ‌స్తే రుణ‌మాఫీతో పాటు ఇంకేం చేయ‌బోతున్నామో చెప్పేందుకు ఏకంగా రాహుల్ గాంధీతో వ‌రంగ‌ల్ లో రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ పెట్టింది. నిరాశతో ఉన్న కాంగ్రెస్ క్యాడ‌ర్ లో కొత్త ఉత్తేజం నింపే ప్ర‌య‌త్నం చేసింది. ఇటు పాద‌యాత్ర పేరుతో ఉన్న బండి సంజ‌య్ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ స‌భ‌కు ధీటుగా కేంద్ర‌మంత్రి అమిత్ షా తో భారీ స‌భ‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ స‌భ‌కు 5ల‌క్ష‌ల మందిని స‌మీక‌రించాల‌ని ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది.

రాహుల్ గాంధీ వ‌చ్చి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను టార్గెట్ చేశారు. సీఎం కాదు ఆయ‌నో రాజు అంటూ విమ‌ర్శించారు. ఇప్పుడు అమిత్ షా వ‌చ్చిన కేసీఆర్ టార్గెట్ గానే ప్ర‌సంగాలుంటాయి. రాష్ట్ర నాయ‌కుల విమ‌ర్శ‌ల‌కు అయితే హ‌ద్దే లేకుండా పోయింది. ఈ విమ‌ర్శ‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు, మంత్రులు కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నా… కేసీఆర్ ఇచ్చే జ‌వాబును మ్యాచ్ చేయ‌లేరు. దీంతో అమిత్ షా స‌భ ముగిశాక టీఆర్ఎస్ కూడా ఓ భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఉమ్మ‌డి అదిలాబాద్ జిల్లా చెన్నూర్ లో టీఆర్ఎస్ స‌భ ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. చెన్నూరు రైతుల కోసం ప్ర‌త్యేకంగా లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీంతో పాటు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే బాల్క‌ సుమ‌న్ సీఎంను ఒప్పించి నిధులు మంజూరు చేయించుకున్నారు. వీటికి ఓపెనింగ్స్ కోసం కేసీఆర్ ను ఆహ్వానించార‌ని… అక్క‌డే స‌భ కూడా ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రులో కానీ వ‌చ్చే నెల మొద‌టి వారంలో కానీ ఈ స‌భ ఉండే అవ‌కాశాలున్నాయి.

- Advertisement -