తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం…1వ తరగతి నుండి 9వ తరగతుల వరకు పరీక్షలు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 15 వరకు పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నరేగా కూలీలను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధానికి సూచించామన్నారు. ప్రధానితో మూడు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక అంశాలపై చర్చించామని తెలిపారు.
తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా దేశ జీడీపీలో కొంత డబ్బును మార్కెట్‌లోకి విడుదల చేసే వెసులుబాటు ఉందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 503కు చేరాయని తెలిపారు సీఎం కేసీఆర్. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. 14 మంది చనిపోయారని వెల్లడించారు. 96 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 393 అని తెలిపారు. ఇందులో ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.ఏప్రిల్ 24 వరకు తెలంగాణ ఫ్రీగా స్టేట్ అవుతుందని చెప్పారు.