జాతీయ రాజకీయాలపై సానుకూలంగా చర్చలు: కేసీఆర్

104
kcr cm
- Advertisement -

దేశ రాజకీయాలపై చర్చించేందుకే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యానని తెలిపారు సీఎం కేసీఆర్. అన్ని విషాయలపై ఏకాభిప్రాయానికి వచ్చాం… చర్చలు సానుకూలంగా సాగయన్నారు. మహారాష్ట్ర సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం…తెలంగాణ-మహారాష్ట్ర మధ్య 100 కిమీ సరిహద్దు ఉందన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశంలో అతిపెద్ద ప్రవర్తన రావాల్సి ఉందని..యువతను మంచిమార్గంలో నడిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

శివాజీ మహారాజ్, బాల్ ఠాక్రే ఇచ్చిన స్పూర్తితో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకే ఉద్దవ్ ని కలిశానని తెలిపారు సీఎం కేసీఆర్. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. దేశాభివృద్ధి కోసం చట్టాల్లో చేయాల్సిన మార్పులపై చర్చించానని తెలిపారు. త్వరలోనే మిగితా జాతీయ నాయకులను కలుస్తానని తెలిపారు.

- Advertisement -