నేను కలగన్న తెలంగాణ సాకారమైందిఃసీఎం కేసీఆర్

637
kcr
- Advertisement -

తాను కలగన్న తెలంగాణ సాకారమైంద్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేర్ జలాశయాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాంగగా ఉన్నటువంటి మిడ్ మానేరు ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తైన సందర్భంలో సుమారు ఒక 50నుంచి 60టీఎంసీలు కాళేశ్వరం కంట్రిబ్యూషన్ కింద ఎస్సారెస్పీతోని సంబంధంలేకుండా ఎత్తి పోసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రెండు రిజర్వాయర్లు మిడ్ మానేరు, లోయర్ మానేర్ డ్యాంలు కూడా ఇప్పుడు మనకు నిండుగా ఉన్నాయి. ఎస్సారెస్పీతోని ఎమాత్రం సంబంధం లేకుండ ఈ దిగువన ఉండే ఆయకట్టు మొత్తం అద్భుతంగా రెండు పంటలు పండే ఆస్కారం ఉంది. ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ అనేది తొలగిపోయింది. ఇక్కడ వర్షపు చుక్క పడకున్నా కూడా అద్బుతంగా రైతాంగం నిశ్చితంగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. 2001 ఎప్రిల్ లో కరీంనగర్ ఎస్ ఆర్ కాలేజి లో తొలి సింహ గర్జన లో నేను చెప్పిన అప్పుడు ఖచ్చితంగా నిజాయితి ఉన్న పోరాటం విజయం సాధిస్తది. తెలంగాణ రాష్ట్రం వస్తది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నింటికి మించి ఈ జిల్లాలు గోదావరి నది ఒరుసుకుని పారుతున్నయి. ఇలా గోదావరి నది ఓరుసుకుని పారుతున్న కరువు పీడిస్తుంది. ఇది సంపూర్ణమైన వివక్షకు గురైంది. గోదావరి ఒరుసుకుని పారుతున్న జిల్లాలు వరంగల్, కరీంనగర్, కొంత నిజమాబాద్, ఖమ్మం జిల్లాలో కరువు ఉండటం అంటే పూర్తిగా అహేతుకం అన్నారు .

ఈ రోజు నాకు చాలా హృదయపూర్వకమైనటువంటి సంతోషం కలిగింది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ మీద నిలుచుని పూజ చేస్తున్నపుడు చాలా ఆనందం వేసింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించిన ఫిలింగ్ వచ్చింది. ఈ జిల్లా గొప్పతనం ఏంటి అంటే.. గోదావరితో పాటు సుమారు 45 వాగులు ఉంటాయి. ఇవన్నీ ఉండి కూడా కరువు కాటకాలకు లోనయింది. ఇదే జిల్లానుంచి దుబాయ్, గల్ఫ్ కు వెళ్లడం బాధ కలిగించిన విషయం. కరెంట్ లేక చాలా మంది చనిపోయారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు మరణించారు. ఒక రోజు నేను రాత్రి వెళుతుంటే చావులు పరిస్కారం కాదు చావకండి అని ఈ జిల్లా కలెక్టర్ గోడలపై రాసిండ్రు. ఆ రోజు మేము చాలా బాధపడ్డం. 70ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత ఈ పరిస్ధితి ఎంటి అని. ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న జిల్లా ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి లక్ష్మీ సరస్వతి , శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ లు అన్ని కలిపి 140కిమీ సజీవంగా ఉంది. 365రోజులు నీళ్లు ఉంటాయి. కరీంనగర్ జిల్లాకు అదొక జీవధార అన్నారు.

కాకతీయ కెనాల్ ఈ జిల్లాలో 200కి.మీ పారుతది. భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. ఈ రాష్ట్రం అభివృద్దిపై మాకు కమిట్మెంట్ ఎక్కువ ఉంటది. మాకు ఉన్న కమిట్ మెంట్ ఏ పార్టీకి ఉండదు. తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి కొట్లాడినం. ఇది అందరికి తెలిసిన విషయం. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ముఖ్యంగా ఇరిగేషన్ విషయంలో ఒక ఎక్స్ రే కళ్లతోని చూసింది టీర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 12వందల చెక్ డ్యాంలు ఉంటే అందులో సింహభాగం కరీంనగర్ లోనే ఉన్నయి. మిడ్‌ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు అద్భుతంగా పైకి ఎగిసిపడుతున్నాయి. కాకతీయ కాలువ పాత కరీంనగర్‌ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. కాకతీయ కాలువ రెండు పంటలకు తొమ్మిది నెలలు పారుతుంది. వరుద కాలువ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంటుంది. ఈ కాలువ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న బాధ్యత రాష్ట్రం మీద ఇతర ఏ పార్టీలకు ఉండదు. మొత్తం రాష్ట్రానికి ఏం కావాల్నో టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలిసినంతా ఆయా జిల్లాల్లో ఉన్న సీనియర్‌ నాయకులకు కూడా తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా 1230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు సీఎం కేసీఆర్ .

- Advertisement -