కరోనాను ఎదుర్కొనేందుకు విరాళాలు అందించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అభినందించారు సీఎం కేసీఆర్. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చూపించిన ఈ స్పూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందని సీఎం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆపద సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొత్తం కలిసి దాదాపు 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మంజూరయ్యే మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు.
ఇక ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో ఎమ్మెల్సీకి ఏడాదికి రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. ఏడాది నిధులను కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందివ్వనున్నట్లు టిఆర్ఎస్ శాసనసభా పక్షం ప్రకటించింది.