హరీష్ ఆణిముత్యం.. సీఎం కేసీఆర్ ప్రశంసలు..

245
kcr on harish
- Advertisement -

సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. హరీష్ రావు ఆణిముత్యం లాంటి వ్యక్తి అని కొనియాడారు. ‘తెలంగాణ కోసం ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏర్పడడం.. రాజీనామా చేసి ఢిల్లీకి పోతున్నాను అని చెబితే.. అందరం కలిసి గంట సేపు అక్కడ హాల్‌లో ఏడ్చాం. నేను ఢిల్లీకి పోయినదానికి.. మీరు నన్ను పంపినదానికి.. మీ అందరి పేరు నిలబెట్టి తెలంగాణను తెచ్చి ప్రజల చేతిలో పెట్టాను.

ఒక్క తెలంగాణనే కాదు. సిద్దిపేటకు నా అంత పని చేసే మనిషి కావాలని ఆలోచించి మంచి ఆణిముత్యం లాంటి హరీష్ రావును మీకు అప్పగించాను. హరీష్ కూడా నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. ఇందుకు నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. హరీష్ రావు మంచి హుషారుమీదున్నాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పోతే చాలు అన్నాడు. ఇక్కడికి వచ్చాక ప్రజల ముందు నన్ను నిలబెట్టి సిద్దిపేటకు ఇంకా ఏం కావాలో అన్నీ అడిగేశాడు.’ అని సీఎం కేసీఆర్ చమత్కరించారు.

- Advertisement -