- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక,గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు,మౌలిక వసతుల అభివృద్ధి,తీర ప్రాంతాల భద్రత తదితర అంశాల్లో సేవలందించే పోలార్ శాటిలైట్ వెహికల్ సీ 47ను విజయంతంగా ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇస్రో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారని వారి సేవలను కొనియాడారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్-3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ-47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని జీవితకాలం ఐదేళ్లు…బరువు 1,625 కిలోలని తెలిపారు.
- Advertisement -