పోలీస్ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి..

81
cm
- Advertisement -

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( 21- అక్టోబర్ ) సందర్బంగా వారి సేవలను స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని సిఎం అన్నారు.

అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు.

- Advertisement -