- Advertisement -
మాజీ మంత్రి,కార్మిక నేత,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి 12.20కి మృతిచెందారు. నాయిని మృతితో టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.
ఇక సీఎం కేసీఆర్ …నాయిని మృతితో విషాదంలో మునిగిపోయారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, కార్మిక లోకానికి తీరనిలోటని పేర్కొన్నారు.
వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపోలో దవాఖానలో నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి సీఎం కేసీఆర్ వెంటే నడిచారు నాయిని.
- Advertisement -