- Advertisement -
తెలంగాణ ఉద్యమ గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మరణం పట్ల ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లో గాయకుడిగా ప్రహ్లాద్ చేసిన సాంస్కృతిక కృషిని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రజా కవిగా, జన నాట్యమండలిలో చురుకైన పాత్రతోపాటు తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించారు. ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం హన్మాపురం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
- Advertisement -