- Advertisement -
సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమని, జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మెండు శ్రీనివాస్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందని చెప్పారు.
తన స్వగ్రామం పరకాలలో ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు.
- Advertisement -