జోగు రామన్నకు మాతృ వియోగం..సీఎం సంతాపం

62
- Advertisement -

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి భోజమ్మ(98) సోమవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. బోజమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. శోకతప్తులైన జోగు రామన్న కుటుంబ సభ్యులకు, సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

భోజమ్మ మృతి పట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -