మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌..

73
- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు మహబూబ్ నగర్ లోని సొంత మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. కాగా,ఆమె దశదిన కర్మను ఆదివారం మహబూబ్ నగర్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

శాంతమ్మ సమాధి వద్ద ఆయన నివాళులు అర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రిని ఓదార్చారు. శ్రీనివాస్ గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.

- Advertisement -