ఎమ్మెల్సీ సమరం..క్యాంపు రాజకీయాలొద్దు:సీఎం కేసీఆర్

359
kcr mlc elections
- Advertisement -

రాష్ట్రంలో జరగనున్న నాలుగు ఎమ్మెల్సీ స్ధానాలు మనవె కావాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మంత్రులతో సమావేశమైన సీఎం ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేశారు. రంగారెడ్డి,వరంగల్,నల్గొండ స్ధానిక సంస్థలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ మనవె కావాలన్నారు.

శుక్రవారం నామినేషన్ల గడువు ముగియడంతో మూడు జిల్లాల్లో పరిస్థితులపై అంచనాకు వచ్చారు. రంగారెడ్డిలో 812 ఓట్లకు గాను 650,నల్గొండ జిల్లాలో 1084కు గాను 730, వరంగల్ జిల్లాలో 905 ఓటర్ల ఉండగా 742 ఓట్లకు పైగా టీఆర్ఎస్‌కు బలం ఉందని లెక్కతేల్చారు. ఈ గణంకాలను బట్టిచూస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమని వీలైనంత ఎక్కువ మెజార్టీ సాధించడం ద్వారా బలాన్ని నిరూపించుకోవాలన్నారు.

కాంగ్రెస్‌కు ఈ మూడు స్ధానాల్లో బలం లేనందుకు చిత్తుగా ఓడించడంతో ద్వారా ఆ పార్టీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రజలు టీఆర్ఎస్‌ వైపు ఉన్నారనే సంకేతాలను ఇవ్వాలన్నారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించిన కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,నేతలను సమన్వయంతో ముందుకుసాగాలన్నారు.

వరంగల్,నల్గొండ,రంగారెడ్డి జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి,జగదీశ్ రెడ్డి,మల్లారెడ్డిలతో పాటు మిగిలిన 8 మంది మంత్రులకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు. వీరంతా కౌన్సిలర్లు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్‌కు లేదని ప్రజాప్రతినిధులతో రోజువారి భేటీలను నిర్వహించాలన్నారు. ఎన్నికలు ముగిసేవరకు మంత్రులు ఆయా జిల్లాల్లోనే ఉండాలన్నారు.

మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానానికి జూన్ 7న ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీ ఉండటంతో గెలుపు ఖాయమే. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీనేతలతో చర్చించారు సీఎం.దీంతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పార్టీ మారి అనర్హత వేటు పడిన యాదవరెడ్డి,రాములు నాయక్‌(గవర్నర్ కోటా),భూపతిరెడ్డి(నిజామాబాద్ స్ధానిక కోటా)లో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -