CM KCR:ధర్మపురికి ఒకేసారి దళితబంధు

123
- Advertisement -

ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌ను మరోసారి గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..కొప్పులను భారీ మెజార్టీతో గెలిపిస్తే హుజూరాబాద్‌ తరహాలో ఒకేసారి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. కొప్పుల ఈశ్వర్‌ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలవాలన్నారు.

దళితులను ఓటుబ్యాంకు వాడుకున్నారు తప్ప.. ఎన్నడూ చేసిన పాపానపోలేదు అన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి పైకి తీసుకురావాలని.. చేతనైంతగా, ఉన్నంతలో అమలు చేస్తుందన్నారు. దఫాదఫాలుగా అయినా ధర్మంగా చేయాలని రాష్ట్రల ఖజానాను ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం అన్నారు.

కులం, మతం అని చూడకుండా అందరికి లబ్ది చేకూరుస్తున్నామన్నారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేసుకున్నాం అని… పనులు జరుగుతున్నయ్‌.. ఇంకా జరగాల్సి ఉంటే.. మరింత డబ్బు మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మార్చుకుందాం అన్నారు. సంపదను పెంచుతున్నాం. పేదలకు పంచుతున్నాం అన్నారు. గతంలో లక్షలోపు తలసారి ఆదాయం ఉండే.. ఈ రోజు 3.18లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నాం అన్నారు. తాగునీటి సరఫరా, కరెంటు, విద్యుత్‌ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందన్నారు.

Also Read:కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం:సీపీఎం తమ్మినేని

- Advertisement -