అమిత్‌ షాతో సీఎం కేసీఆర్ భేటీ..

37
cm kcr

ఈరోజు ఢిల్లీ హ‌స్తిన‌లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్రవారం ప్రధాని న‌రేంద్ర‌మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. ఈరోజు కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌ షాను కలుసుకున్నారు. ఈ భేటీలో నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని అమిత్‌ షాకు వినతిపత్రం అందించారు సీఎం కేసీఆర్. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవి. ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగింది. 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు జరిగిందని సీఎం తెలిపారు.

అదేవిధంగా 2016 లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగింది. 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటు జరిగింది. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.