కేసీఆర్ నాయకత్వమే…శ్రీరామ రక్ష

75
vemula
- Advertisement -

కేసీఆర్ నాయకత్వమే దేశానికి, తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు మంత్ర వేముల ప్రశాంత్ రెడ్డి. అవే జూటా మాటలు – ఆక్రోశపు ప్రసంగాలు. బీజేపీ దొంగల ముఠా.. తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం చేశారు. రాష్ట్ర సాధకుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు సందించిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదన్నారు.

తెలంగాణ అంటేనే అణువణువునా విషం నింపుకున్న కేంద్ర బీజేపీ నాయకుల మోసపు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఒక్క బక్క పలుచని కేసిఆర్ గారిని ఎదుర్కోవడానికి సమావేశాల పేరు మీద ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ మీద పడ్డరు. ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం మొదలైంది. మీ మేకపోతు గాంభీర్యపు మాటలకు భయపడేవారు ఎవరూ లేరిక్కడ. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోడీ, అమిత్ షా తెలంగాణ పాలిట శత్రువులే. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.

దేశాన్ని నీ కార్పొరేట్ మిత్రులకు దారాదత్తం చేయడాన్ని యావత్ దేశం పక్షాన కేసిఆర్ ప్రశ్నించారు. ఎందుకు సమాధానం చెప్పలేదు..? తెలంగాణ గడ్డ మీదకు వచ్చి అరిచి గీ పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ మాటలు హర్షించరు. యువనాయకులు కేటీఆర్ గారి కృషి వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటే దాన్ని జీర్ణించు కొలేకపోతున్నారు.. మీ వాట్సాప్ యూనివర్సిటీని, మీ అసత్యపు సోషల్ మీడియా ప్రచారాలకు కేటీఆర్ గారు చెక్ పెడుతున్నారు. అట్లాగే మా వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుదామనే మీ కుట్ర తెలంగాణ రైతన్నలకు ఇంకా గుర్తున్నది మోదీ గారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, సంస్థలు కుట్రపూరతంగా ఆపుతూ.. గుజరాత్ కు తరలించుకు పోవడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్లు అన్ని ట్రబుల్ ఇంజన్లే. తెలంగాణ రాష్ట్ర తరహా పథకాలు కావాలని మీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎందుకు అడుగుతున్నారు మోడీ..? కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలని, కేసిఆర్ గారి నాయకత్వం కావాలని యావత్ భారతదేశం కోరుకుంటోందన్నారు.

- Advertisement -