CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన

89
- Advertisement -

హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దశాబ్ది బ్లాక్‌ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు భూమిపూజ చేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి.

పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రిగా మారిన నిమ్స్‌కు ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాటను అమల్లోకి తెస్తూ మొదటి ఏడాదే 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా నిమ్స్‌కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు.

Also Read:అన్నవరంలో పవన్‌..వారాహికి ప్రత్యేక పూజలు

2014 నాటికి నిమ్స్‌లో 900 పడకలు మాత్రమే ఉండేవి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు.

- Advertisement -