వేష,భాషల్లో మార్పు రావొద్దు:కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్

150
telangana cm
- Advertisement -

ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు మేయర్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు సీఎం కేసీఆర్. మంచిగా ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి…….. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు.

కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు.. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలని హితబోద చేశారు.

పదవిలోకి రాగానే వేష,భాషల్లో మార్పులు రావొద్దని… ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దని తెలిపారు. అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుందని…మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని తెలిపిన సీఎం…. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -