సీఎం కేసీఆరే మా ధైర్యం: మల్లారెడ్డి

135
mallareddy
- Advertisement -

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మూడవ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఈ దాడుల్లో 8 కోట్లు దొరికాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని..తమ దగ్గర దొరికింది రూ.28 లక్షలేనని అన్నారు. పాలు అమ్మి, పూలు అమ్మి, బోర్లు వేసి, వ్యాపారాలు చేసి, ఎంతో కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. త

ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పారని అన్నారు. తమకు కేసీఆర్ ఉన్నారని… ఆయనే తమ ధైర్యం అని చెప్పారు. అంతా కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుకు తమ కాలేజీల్లో మంచి విద్యను అందస్తున్నామని చెప్పారు.

రైడ్స్ తనకు కొత్త కాదన్నారు. తనకు రూల్స్, చట్టం, అన్నీ తెలుసు అని అన్నారు. కేంద్ర బలగాలతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిననే ఒకే ఒక కారణంతో తమపై ఐటీ దాడులు చేశారని విమర్శించారు. కాలేజీల ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయని… అలాంటప్పుడు అక్రమాలకు చోటెక్కడుంటుందని ప్రశ్నించారు. తన విద్యా సంస్థలల్లో తన కొడుకుకి కూడా తాను సీటు ఇవ్వలేనని… తన కొడుకైనా కౌన్సిలింగ్ ద్వారానే సీటు తెచ్చుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -