కొండపోచమ్మ రిజర్వాయర్‌ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

192
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ని ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుమార్గంలో కొండపోచమ్మకు చేరుకున్న సీఎం … మర్కూ క్‌ పంప్‌హౌజ్‌ నుంచి 2 పంపుల ద్వారా ఎత్తిపోస్తున్న జలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

రిజర్వాయర్‌లోకి 0.8 టీఎంసీ నీళ్లు చేరినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాలువలు, పంపుల పనితీరు, రిజర్వాయర్‌లో నీటిని నింపే అంశాలపై ఈఎన్సీ హరిరాంతో చర్చించిన సీఎం పలు సూచనలు చేశారు.

గత నెల 29న సీఎం కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో రెండుమోటర్లను ఆన్‌చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

- Advertisement -