- Advertisement -
సీఎం కేసీఆర్ ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎకరం విస్తీర్ణంలో రూ. 4 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో జీ ప్లస్ వన్‌గా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉంటుంది.
- Advertisement -