సిద్దిపేటలో టీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

179
CM KCR
- Advertisement -

ఈ రోజు సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ ప్రారంభించారు.

అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

అనంతరం సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

- Advertisement -