విద్యుత్‌సంస్థలకు అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌

543
cm kcr
- Advertisement -

విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు ప్రతీ నెలా కరెంట్ కట్టేలా కఠినమైన విధానం అవలంభిస్తామని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో త్వరలో పవర్ వీక్ నిర్వహిస్తామని అన్నారు. ప్రగతిభవన్‌లో విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష జరిపారు.

తెలంగాణ పురోగాభివృద్దిలో విద్యుత్ సంస్థల పాత్ర గొప్పదన్నారు. విద్యుత్ సంస్థలు మరింతగా వృద్ధి చెందాలని ఎలాంటి పరిస్ధితుల్లోనూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండకూడదన్నారు. గ్రామాలు విధిలైట్ల నిర్వహణలో క్రమశిక్షణ రావాలన్న సీఎం …కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని సీఎం చెప్పారు. సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. రైతులకు 24 గంటల కరెంట్,ఎత్తిపోథల పథకాలకు అయ్యే విద్యుత్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.

విద్యుత్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పూచికత్తు ఇస్తుందన్నారు. 60 రోజుల పాటు అమలయ్యే విద్యుత్ ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు పవర్ వీక్ నిర్వహిస్తామన్నారు. గ్రామానికి పట్టణానికి ఎంత విద్యుత్ అవసరమో శాస్త్రియంగా అధ్యయనం చేయాలన్నారు. విద్యుత్ అవసరాల కోసం స్థల సేకరణలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది…. ప్రస్తుతం తెలంగాణ… విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అధికారులు, ఉద్యోగుల శ్రమ, చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -