- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం హుజుర్ నగర్ లో ప్రజా కృతజ్నత సభకు హాజరుకానున్నారు. ఈసందర్భంగా కాసేపటి క్రితం ప్రగతి భవన్ నుంచి హుజుర్ నగర్ కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాన్ తో సీఎం వెళ్తున్నారు. ఈసభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీగా ప్రజలు హాజరుకానున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ నుంచి కూడా భారీగా టీఆర్ఎస్ శ్రేణులు ఈమీటింగ్ హాజరుకానున్నారు. విజయవాడ జాతీయ రహదారి వెంబడి మార్గం మధ్యలో టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సీఎం కాన్వాయ్‌కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మేట్ పెద్దఅంబర్ పేట్ ఓ ఆర్ ఆర్ వద్ద స్వాగతం పలకడానికి సిద్దగా mla మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గ mla సుధీర్ రెడ్డి ,మంత్రి మల్లారెడ్డి సిద్దంగా ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఉన్నారు.
- Advertisement -