- Advertisement -
సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ (ప్రతిమ రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌కు చేరుకోనున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు.
- Advertisement -