వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌..

27
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అనంతగిరిలో మెడికల్‌ కాలేజీ కోసం 30 ఎకరాల భూమి కేటాయించగా సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా 60కోట్ల 70 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి సబితా. ఇక సీఎం పర్యటన కోసం 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే రూట్‌లో రూఫ్‌ టాప్‌లు, డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలతో గట్టి నిఘాను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -