జగిత్యాలకు సీఎం కేసీఆర్..

92
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణంలోని హెలీపాడ్ కు చేరుకుంటారు.

పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 12.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు వైద్య కళశాల భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 1.15 గంటలకు సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభా స్థలానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -