సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి..

41
- Advertisement -

సీఎం కేసీఆర్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్ద వంగర మండలం గంట్ల కుంటలో సీసీ రోడ్లు పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాలకు ఈ సారి సీసీ రోడ్లు వచ్చాయని చెప్పారు.

రోడ్లను నాణ్యత ప్రమాణాల ప్రకారంగా వేయాలని సూచించారు. ఈ మార్చిలోగా రోడ్లు పూర్తి చేస్తే, బిల్లు లు త్వరగా వస్తాయని, మార్చి తర్వాత మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -