హ్యాట్రిక్ కోసం.. కసరత్తు!

109
kcr cm
- Advertisement -

ఓ వైపు దేశ రాజకీయాలు మరోవైపు రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రణాళిక…ఇదే ఎజెండాతో ముందుకుసాగుతున్నారు సీఎం కేసీఆర్. పాలనలో తన మార్క్ చూపిస్తూనే పొలిటికల్‌గా మరింత బలోపేతం అయ్యేలా సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం 2024లో లోక్ సభ ఎన్నికలు, ఇక అంతకంటే ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకే సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వస్తే అందరి దృష్టి రాష్ట్రం వైపు ఉంటుంది అందుకే ఇప్పుడు దీనిపై గట్టి ఫోకస్ చేశారు సీఎం.

తెలంగాణ పాలనను దేశానికే రోల్ మోడల్ అని చూపించి హ్యాట్రిక్ టార్గెట్‌ని కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు సీఎం. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం కూడా చేకూర్చాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అంతా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. దీంతో బీజేపీ-కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత టీఆర్ఎస్ పై పూర్తి దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -