రైతుల‌ను మోసం చేస్తే ఊరుకోం.. మోదీపై కేసీఆర్ ఫైర్‌..

47
- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జనగామ బహిరంగసభలో ఆయన మోదీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీ దాకా వస్తామని, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సివస్తే కొట్లాడ్డానికి సిద్దమని కేసీఆర్‌ అన్నారు.

కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు సిద్ధమని, విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారన్నారు.. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట రైతుల‌ను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా స‌రే బావుల వ‌ద్ద‌ మోటార్లకు క‌రెంట్ మీట‌ర్లు పెట్టం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -