ఎంపీ అభ్యర్దులకు సీఎం కేసీఆర్ ఫోన్..10మందికి టికెట్లు ఖరారు

285
cm kcr
- Advertisement -

ఎప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో ప్రచారాల్లో బిజీగా ఉన్నారు రాజకీయ నాయకులు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో అభ్యర్దుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటివలే 8మందితో మొదటి లిస్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ జాబితా కూడా తుది దశకు చేరుకుందని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్ధులకు ధీటుగా బరిలోకి దించాలని వ్యూహాలు రచిస్తున్నారు గులాబీ బాస్. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. టికెట్లు కన్ఫామ్ అయిన వారికి స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప్రచారం ప్రారంభించమని చెప్పుతున్నారట. నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్నింటిని సిద్దం చేసుకొండి..త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారట.

ఇప్పటికే 10మంది అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసిన టీఆర్ఎస్ మరో ఆరు స్ధానాల ఎంపిక ను పెండింగ్ లో పెట్టింది. అయితే ఈసారి నలుగురు సిట్టింగ్ ఎంపిలకు టికెట్ దక్కదనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆయా సిట్టింగ్‌ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్‌ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. నేడు కరీంనగర్ బహిరంగసభలో లేదా ఆ తర్వాత జరిగే నిజామాబాద్ సభలో అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

సీఎం కేసీఆర్ కన్ఫామ్ చేసిన వారిలో నిజామాబాద్ ఎంపీ కవిత, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహిరాబాద్ బీ.బీ పాటిల్, అదిలాబాద్ బోడం నగేశ్, వరంగల్ పసునూరి దయాకర్, చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి , మల్కాజిగిరి: కె. నవీన్‌రావు , నాగర్‌ కర్నూల్‌: పి. రాములు వీరి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక సిట్టింగ్ ఎంపీలు జితెందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతారం నాయక్ , గుత్తా సుఖేందర్ రెడ్డి లకు ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చనే సమాచారం.

- Advertisement -