- Advertisement -
గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు సీఎం కేసీఆర్.
గజ్వేల్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కామారెడ్డి బయల్దేరారు. అక్కడ నామినేషన్ సమర్పించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ప్రచారం చివరి రోజున గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌లోనే చివరి సభ నిర్వహించి ప్రచారానికి కేసీఆర్ ముగింపు పలికారు. అదే సెంటిమెంట్‌ను ఈ ఎన్నికల్లోనూ రిపిట్ చేయనున్నారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు కూడా ఇవాళే నామినేషన్ వేయనున్నారు.
Also Read:శనగలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో!
- Advertisement -