ఈ రోజు ప్రగతి భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌కు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని కేసీఆర్ తెలిపారు.”రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులు ప్రతీ పండుగను గొప్పగా నిర్వహించేవారు. నరసింహన్ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం అని సీఎం అన్నారు.
నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే టీఆర్‌ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. గవర్నర్ నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నరసింహన్ వివరించేవారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
గవర్నర్ నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైయ్యారు. ఇక రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు రాజ్‌భవన్‌లో కొనసాగుతున్నాయి.