బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్‌..

478
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ఆదాయానికి, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని అభివర్ణించారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం తయారైన బడ్జెట్ అని పేర్కొన్నారు.

సకల వర్గాల సంక్షేమం, అన్ని రంగాల పురోగతిపై తమ ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయంటూ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచే వచ్చే నిధుల్లో కోత విధించినా, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలగకుండా బడ్జెట్ లో ప్రతిపాదనలు రూపొందించారని తన మేనల్లుడు హరీశ్ రావును అభినందించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సాధ్యమైనంత మెరుగైన బడ్జెట్ ను అందించారంటూ మంత్రులను, అధికారులను మెచ్చుకున్నారు.​

- Advertisement -