ముఖేష్ గౌడ్‌ కన్నుమూత..సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

635
kcr mukehs goud
- Advertisement -

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు.

కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేశ్‌ గౌడ్…..వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‌యూఐలో పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. 1986లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన జాంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 1989లో మహారాజ్ గంజ్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2004లో ,2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

- Advertisement -