దూకుడు పెంచిన బి‌ఆర్‌ఎస్..?

70
- Advertisement -

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ యమ దూకుడు మీద ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కే‌సి‌ఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులపై కే‌సి‌ఆర్ గట్టిగానే దృష్టి పెట్టారు. ప్రజలు పార్టీపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు. నియోజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది అనే దానిపై ఇప్పటికే పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించారు సి‌ఎం కే‌సి‌ఆర్. పని తీరు బాగాలేని నేతలను, ఎమ్మెల్యేలను బహిరంగంగానే పలు మార్లు హెచ్చరించారు. .

ఇకనుంచైనా పద్దతి మార్చుకొని నిత్యం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే సూచించారు. ఇదిలా ఉంచితే నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కూడా కే‌సి‌ఆర్ గట్టిగానే దృష్టి పెట్టరాట. ఆయా నియోజిక వర్గాలలోని 20 మంది ఎమ్మెల్యేలను ఖరారు చేసినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జులై రెండో వారం లేదా మూడో వారంలోగా మొత్తం అన్నీ నియోజిక వర్గాలలోని అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించే అవకాశం ఉందట. కాగా ప్రజా మద్దతు లేని నేతల విషయంలో ఏ మాత్రం ఆలోచించే ప్రసక్తే లేదని, సీటు ఇవ్వడం కుదరదని గతంలోనే చెప్పిన అధినేత చెప్పడంతో.. సీటు దక్కడం.. దక్కకపోవడంపై చాలమంది ఎమ్మేల్యేలు అయోమయంలో ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే తన నిర్ణయాల విషయంలో పక్కా క్లారిటీతో ఉండే కే‌సి‌ఆర్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పూర్తి క్లారిటీతో ఉండే అవకాశం ఉంది. మరి ఈసారి బి‌ఆర్‌ఎస్ విక్టరీ కోసం బరిలోకి దిగే గెలుపు గుర్రాలు ఎవరో చూడాలి.

Also Read:తెలంగాణలో హంగ్.. గ్యారెంటీ ?

- Advertisement -