సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన డిటైల్స్ ఇవే..

70
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల వివరాలు :
17 వ తేదీ :
మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.

18 వ తేదీ : జిల్లా కలెక్టర్ల సమావేశం
ఈ నెల 18 న, దళిత బందు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు.
దళితబంధు అమలు పై సమీక్షించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాలో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చి లోపు అమలు చేసే అంశం పై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు శిక్షణాకార్యక్రమాల నిర్వహణ పై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ అంశం పై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.

19 వ తేదీ : వనపర్తి జిల్లా పర్యటన
ఆదివారం., 19 వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

20 వ తేదీ : జనగామ జిల్లా పర్యటన :
సోమవారం., 20 వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటితో పాటు, సిఎం కెసిఆర్ త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా..అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. ఆ సందర్భంగా నియోజక వర్గం పరిథిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. అచ్చంపేట లో 100 పడకల దవాఖానాను ప్రారంభించనున్నారు.నిజామాబాద్ జిల్లా పర్యటన..లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.జగిత్యాల జిల్లా పర్యటన…లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా….పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభం తో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వికారాబాద్ జిల్లా…పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అదే సందర్భంలో జిల్లాల పర్యటనలో భాగంగా..ఆయా జిల్లాల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు.

- Advertisement -