సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలో ఉండాల్సింది. పలు జాతీయ పార్టీల నేతలు, జాతీయ మీడియాకు సంబంధించిన వారితో భేటీ కానుండగా అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరకున్నారు కేసీఆర్.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. సాయంత్రం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోదయ విద్యాలయాన్ని, మొహల్లా క్లినిక్‌ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ సందర్శించారు.
తర్వాత ఎన్డీటీవీ అధినేత, ప్రముఖ జర్నలిస్ట్ ప్రణయ్‌రాయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు.అనంతరం ఇద్దరు సీఎంలు చంఘీగడ్ వెళ్లి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి అమరులైన రైతు, సైనిక కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. ఇక సోమవారం వ్యవసాయ ఆర్ధిక రంగ నిపుణుడు అశోక్ గులాటితో కేసీఆర్ భేటీ అయ్యారు.