పల్లాను అభినందించిన సీఎం కేసీఆర్..

162
palla rajeshwar reddy
- Advertisement -

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఈ క్రమంలో పల్లా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తనను కలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఎమ్మెల్సీగా మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా విజయానికి కృషి చేశారంటూ మంత్రి ఎర్రబెల్లిని కూడా సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఈ కార్యాక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ అర్బన్, రూరల్ నేతలు కూడా ఉన్నారు.

- Advertisement -