ముఖ్రా కె సర్పంచ్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌..

148
Mukhra K Sarpanch
- Advertisement -

తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత (Open Defecation Free (ODF) status) హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతిగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్ని కేంద్ర జలవనరుల శాఖ స్వచ్ భారత్ మిషన్ కింద ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, తదితర ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసారు. ముఖ్రా కె గ్రామం ODF plus గ్రామంగా ఎంపిక అవ్వడం మన తెలంగాణకే గర్వకారణం అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

‘‘నీను కన్న కలలు మీ గ్రామం ద్వారా నిజమవుతున్నాయి…‘‘ అని ముఖ్రా కె సర్పంచ్ గాడ్గె మినాక్షిని, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. గ్రామంలో 100% మొక్కలు బ్రతకడం చాల అనందమని,సేంద్రియ ఎరువులు తయరు చేస్తున్న తొలి గ్రామం ముఖ్రా కె కావడం అభినందనీయం అని, ప్రతి పల్లె ముఖ్రా కె లాగా తయారు అవ్వాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రంలో మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -