విజయలక్ష్మి మృతి పట్ల సీఎంకేసీఆర్‌ సంతాపం

173
kcr cm
- Advertisement -

తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి ఇటీవల కన్నుమూశారు. విజయలక్ష్మి మృతితో బోడకుంటి వెంకటేశ్వర్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ విజయలక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అటు, విజయలక్ష్మి మృతికి రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -